C.R. Reddy Cancer Center · Leela Mahal Road, Nellore
Dr. Haritha ChiramanaMD, DMSenior medical oncologist & hemato-oncologistNellore Patient guides Book a Consultation
🧠

మెదడులో గడ్డ: ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

Brain tumour: warning signs not to ignore (adults and children)

ముద్రణ ప్రతి · Print PDFమరింత సమాచారం · Read more →

పెద్దవారిలో — వెంటనే వైద్యులను కలవండి

Adults: see a doctor promptly if

మొదటిసారి మూర్ఛ రావడం — ఏ వయసులోనైనా

A first seizure (fit), at any age

కొత్తగా మొదలైన తలనొప్పి, ముఖ్యంగా యాభై ఏళ్లు దాటిన తర్వాత, లేదా ఎప్పుడూ ఉండే తలనొప్పి తీరు మారడం

A new headache, especially after 50, or a change in your usual headache

తలనొప్పితో పాటు వాంతులు; పడుకున్నప్పుడు లేదా దగ్గినప్పుడు నొప్పి ఎక్కువ కావడం

Headache with vomiting, or worse when lying down or coughing

ఒక వైపు చేయి లేదా కాలు బలహీనపడడం, మాట తడబడడం, చూపు మసకబారడం

Weakness of an arm or leg on one side, slurred speech or blurred vision

మతిమరుపు, ప్రవర్తనలో మార్పు, అయోమయం

Forgetfulness, a change in behaviour or confusion

క్యాన్సర్ వైద్యం తీసుకున్నవారికి కొత్తగా ఏ నరాల ఇబ్బంది వచ్చినా

Any new nerve or brain symptom in someone treated for cancer

పిల్లలలో — ఆలస్యం చేయకండి

Children: do not delay if

ఉదయం లేవగానే మళ్లీ మళ్లీ వాంతులు (నులిపురుగులు లేదా అజీర్తి అనుకోకండి)

Repeated vomiting on waking (do not assume worms or indigestion)

నిద్రలో నుంచి లేపే తలనొప్పి, లేదా ఆరేళ్ల లోపు పిల్లలకు తలనొప్పి

Headache that wakes the child, or any headache under 6 years

నడకలో తూలడం, తలను ఒక వైపు వంచి ఉంచడం

Unsteady walking, or holding the head tilted to one side

కొత్తగా మెల్లకన్ను, చూపు తగ్గడం

A new squint or poorer eyesight

నేర్చుకున్న పనులు మరచిపోవడం, చదువులో వెనుకబడడం

Losing skills already learned, or falling behind at school

పసిపిల్లల్లో తల పెద్దదవడం, మాడు ఉబ్బడం

In babies: a growing head or a bulging soft spot

గుర్తుంచుకోండి

Remember

ప్రతి తలనొప్పీ మెదడులో గడ్డ కాదు — కానీ పై లక్షణాలు ఉంటే రంగు మందుతో చేసే ఎం.ఆర్.ఐ. స్కాన్ అవసరం.

Most headaches are not tumours — but with the signs above, a contrast MRI scan is needed.

సాధారణ సీటీ స్కాన్ బాగానే ఉన్నా లక్షణాలు తగ్గకపోతే మళ్లీ వైద్యులను కలవండి.

If symptoms continue after a normal plain CT scan, see the doctor again.

మెదడులో ఉంగరం ఆకారపు గడ్డ కనిపించిన ప్రతిసారీ అది క్షయ కాదు; అవసరమైతే ముక్క పరీక్ష చేయాలి.

A ring-shaped lesion in the brain is not always TB; a biopsy may be needed.

చాలా మెదడు గడ్డలకు, ముఖ్యంగా పిల్లల్లో, మంచి వైద్యం ఉంది.

Many brain tumours, especially in children, can be treated well.

సారాంశం: మొదటిసారి మూర్ఛ, కొత్త లేదా మారిన తలనొప్పితో వాంతులు, బలహీనత, మాట లేదా చూపులో మార్పు, అయోమయం ఉంటే వైద్యులను కలవండి. పిల్లల్లో ఉదయం వాంతులు, తూలడం, తల వంచడం, కొత్త మెల్లకన్నును నిర్లక్ష్యం చేయకండి.

In short: A first seizure, a new or changed headache with vomiting, weakness, speech or vision changes, or confusion needs a doctor’s check and usually an MRI. In children, repeated morning vomiting, unsteady walking, a head tilt or a new squint should never be dismissed. Many brain tumours are treatable.