C.R. Reddy Cancer Center · Leela Mahal Road, Nellore
Dr. Haritha ChiramanaMD, DMSenior medical oncologist & hemato-oncologistNellore Patient guides Book a Consultation
🫁

ఊపిరితిత్తుల క్యాన్సర్: ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

Lung cancer: warning signs not to ignore

ముద్రణ ప్రతి · Print PDFమరింత సమాచారం · Read more →

ఈ లక్షణాలు మూడు వారాలకు మించి ఉంటే వైద్యులను కలవండి

See a doctor if any of these lasts more than 3 weeks

తగ్గని దగ్గు, లేదా ఎప్పటినుంచో ఉన్న దగ్గు తీరు మారడం

A cough that does not settle, or a change in a long-standing cough

కఫంలో రక్తం (ఒక్కసారి వచ్చినా సరే)

Blood in the sputum, even once

ఆయాసం, ఛాతీ నొప్పి

Breathlessness or chest pain

కారణం లేకుండా బరువు తగ్గడం, ఆకలి తగ్గడం

Weight loss or poor appetite without a reason

గొంతు బొంగురు పోవడం

A hoarse voice

మెడ దగ్గర గడ్డ, ముఖం లేదా చేయి వాపు

A lump in the neck, or swelling of the face or arm

తగ్గని భుజం నొప్పి

Shoulder pain that does not go away

వేళ్ల చివర్లు లావుగా ఉబ్బడం

Swollen, rounded fingertips

ఎవరికి ఎక్కువ ప్రమాదం?

Who is at higher risk?

సిగరెట్, బీడీ, చుట్ట, హుక్కా తాగేవారు — మానేసినవారు కూడా

People who smoke cigarettes, bidis, cheroots or hookah, and former smokers

కట్టెలు, పిడకలు, బొగ్గుతో వంట చేసే పొగను ఏళ్ల తరబడి పీల్చినవారు

People who breathed wood, dung-cake or coal cooking smoke for years

ఇతరులు తాగే పొగను రోజూ పీల్చేవారు

People exposed every day to others’ smoke

గతంలో క్షయ వచ్చినవారు, ఏళ్లుగా ఆయాసం జబ్బు ఉన్నవారు

People who had TB before, or long-standing lung disease (COPD)

ఇంట్లో ఎవరికైనా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చి ఉంటే

People with lung cancer in the family

గుర్తుంచుకోండి

Remember

పొగ తాగని వారికి, ఆడవారికి, యువతకు కూడా ఈ క్యాన్సర్ రావచ్చు.

Non-smokers, women and young people can also get lung cancer.

ఎక్స్-రే బాగానే ఉన్నా లక్షణాలు తగ్గకపోతే సీటీ స్కాన్ అవసరం కావచ్చు.

If symptoms continue even with a normal X-ray, a CT scan may be needed.

ముక్క పరీక్ష వల్ల క్యాన్సర్ వ్యాపించదు. పరీక్షలతోనే సరైన వైద్యం తెలుస్తుంది.

A biopsy does not spread cancer. Tests show the right treatment.

తొందరగా గుర్తిస్తే నయం అయ్యే అవకాశం ఎక్కువ.

Found early, there is a better chance of cure.

సారాంశం: దగ్గు, ఆయాసం, కఫంలో రక్తం, గొంతు బొంగురు లేదా బరువు తగ్గడం మూడు వారాలకు మించి ఉంటే — పొగ తాగినా తాగకపోయినా — వైద్యులను కలవండి. తొందరగా గుర్తిస్తే నయం అయ్యే అవకాశం ఎక్కువ.

In short: A cough, breathlessness, blood in the sputum, hoarseness or weight loss lasting more than 3 weeks needs a doctor’s check, whether or not you smoke. Early diagnosis gives the best chance of cure.