నోరు, గొంతు క్యాన్సర్: ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
Mouth and throat cancer: warning signs, and a 2-minute mouth self-check
ముద్రణ ప్రతి · Print PDFవాట్సాప్లో పంపండి · Shareమరింత సమాచారం · Read more →
ఈ లక్షణాలు రెండు వారాలకు మించి ఉంటే వైద్యులను కలవండి
See a doctor if any of these lasts more than 2 weeks
నోట్లో మానని పుండు, తెల్లటి లేదా ఎర్రటి మచ్చ
A mouth ulcer that does not heal, or a white or red patch
నోటిలో, పెదవిపై లేదా మెడలో గడ్డ — నొప్పి లేకపోయినా సరే
A lump in the mouth, on the lip or in the neck, even if it is painless
మూడు వారాలకు మించి గొంతు బొంగురు
A hoarse voice for more than 3 weeks
మింగడంలో నొప్పి లేదా ఇబ్బంది; చెవి బాగానే ఉన్నా చెవి నొప్పి
Pain or difficulty swallowing, or earache with a normal ear
కారణం లేకుండా పళ్లు కదలడం, కట్టుడు పళ్లు సరిగా పట్టకపోవడం
Loose teeth, or dentures that no longer fit, without a reason
నోరు పూర్తిగా తెరవలేకపోవడం, పెదవి లేదా గడ్డం తిమ్మిరి
Not being able to open the mouth fully, or a numb lip or chin
ఉమ్మిలో రక్తం
Blood in the saliva
రెండు నిమిషాల నోటి పరీక్ష — నెలకు ఒకసారి, అద్దం ముందు
The 2-minute mouth self-check — once a month, in front of a mirror
ఎవరికి ఎక్కువ ప్రమాదం?
Who is at higher risk?
గుట్కా, ఖైనీ, జర్దా, పొగాకుతో కిళ్లీ నమిలేవారు
People who chew gutka, khaini, zarda or betel quid with tobacco
పొగాకు లేకపోయినా వక్క, పాన్ మసాలా నమిలేవారు
People who chew areca nut or pan masala, even without tobacco
సిగరెట్, బీడీ తాగేవారు
People who smoke cigarettes or bidis
మద్యం తాగేవారు — పొగాకుతో కలిస్తే ప్రమాదం ఇంకా ఎక్కువ
People who drink alcohol — the risk is much higher together with tobacco
నోట్లో తెల్ల మచ్చలు ఉన్నవారు, నోరు బిగుసుకుపోతున్నవారు
People with white patches in the mouth, or a mouth that is getting stiff
గుర్తుంచుకోండి
Remember
నొప్పి లేని పుండు కూడా క్యాన్సర్ కావచ్చు; పూత మందులతో కాలం గడపకండి.
A painless ulcer can also be cancer; do not lose time with ointments.
ముక్క పరీక్ష వల్ల క్యాన్సర్ వ్యాపించదు.
A biopsy does not spread cancer.
పొగాకు, వక్క మానేస్తే ఏ వయసులోనైనా ప్రమాదం తగ్గుతుంది.
Stopping tobacco and areca nut lowers the risk at any age.
తొలి దశలో గుర్తిస్తే చాలామందికి పూర్తిగా నయమవుతుంది.
Found early, most people are cured.
సారాంశం: నోట్లో మానని పుండు, తెల్లటి లేదా ఎర్రటి మచ్చ, గడ్డ, మూడు వారాలకు మించిన గొంతు బొంగురు, మింగడంలో ఇబ్బంది ఉంటే వైద్యులను కలవండి. నెలకు ఒకసారి అద్దం ముందు నోటిని పరీక్షించుకోండి. పొగాకు, వక్క, మద్యం మానేయండి.
In short: See a doctor for a mouth ulcer that does not heal, a white or red patch, a lump, hoarseness for more than 3 weeks or trouble swallowing. Check your mouth in a mirror once a month. Stop tobacco, areca nut and alcohol.