పొగాకు మానేయండి — ఏ వయసులో మానేసినా లాభమే
Stop tobacco: quitting helps at any age
ముద్రణ ప్రతి · Print PDFవాట్సాప్లో పంపండి · Shareమరింత సమాచారం · Read more →
మానేస్తే శరీరంలో వచ్చే మార్పులు
What happens when you quit
కొన్ని గంటల్లో: రక్తంలో పొగ విషవాయువు తగ్గుతుంది
Within hours: the poisonous gas (carbon monoxide) in the blood falls
కొన్ని వారాల్లో: దగ్గు, ఆయాసం తగ్గి శ్వాస మెరుగవుతుంది
Within weeks: cough and breathlessness ease and breathing improves
ఒకటి రెండు సంవత్సరాల్లో: గుండెపోటు ప్రమాదం బాగా తగ్గుతుంది
In 1–2 years: the risk of heart attack falls sharply
పదిహేను సంవత్సరాల తర్వాత: ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది
After 15 years: the risk of lung cancer falls a great deal
క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా మానేయాలి
Quit even after a cancer diagnosis
వైద్యం బాగా పనిచేస్తుంది; శస్త్రచికిత్స, కిరణ చికిత్స ఇబ్బందులు తగ్గుతాయి.
Treatment works better; side effects of surgery and radiotherapy are fewer.
క్యాన్సర్ మళ్లీ రావడం, కొత్త క్యాన్సర్ రావడం తగ్గుతాయి.
The chance of the cancer returning, or a new cancer, falls.
ఎలా మానేయాలి?
How to quit
మానేసే రోజు నిర్ణయించుకుని ఇంట్లోవారికి చెప్పండి.
Choose a quit day and tell your family.
ఇంట్లో సిగరెట్లు, బీడీలు, అగ్గిపెట్టెలు తీసేయండి.
Remove cigarettes, bidis and lighters from the house.
కోరిక వస్తే నీళ్లు తాగండి, కొంచెం నడవండి, ఐదు నిమిషాలు ఆగండి — కోరిక తగ్గిపోతుంది.
When the urge comes: drink water, walk a little, wait 5 minutes — it passes.
నికోటిన్ నమిలే బిళ్లలు, చర్మంపై అతికించే పట్టీలు, వైద్యులు ఇచ్చే మందులు సహాయపడతాయి.
Nicotine gum or patches and medicines from your doctor help.
బీడీ, గుట్కా, ఖైనీ, జర్దా కూడా అంతే హానికరం.
Bidis, gutka, khaini and zarda are just as harmful.
వంట పొగ తగ్గించండి: గ్యాస్ పొయ్యి వాడండి, కిటికీలు తెరిచి వంట చేయండి.
Reduce cooking smoke: use a gas stove and cook with windows open.
సారాంశం: ఏ వయసులో మానేసినా లాభమే — క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా. ఉచిత సహాయం కోసం 1800-11-2356 కు ఫోన్ చేయండి.
In short: Quitting tobacco helps at any age, even after a cancer diagnosis. Call the free quitline 1800-11-2356 for help.