Home / Myth Busters / Prostate cancer
Only very elderly men get prostate cancer?
బాగా వయసు మళ్లిన మగవాళ్లకు మాత్రమే ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుందా?
The risk rises with age, especially after 50, but prostate cancer can also occur in younger men.
వయసుతో, ముఖ్యంగా యాభై తర్వాత, ప్రమాదం పెరుగుతుంది, కానీ చిన్న వయసు మగవారికి కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ రావచ్చు.
తెలుగు అనువాదం డాక్టర్ హరిత సమీక్షలో ఉంది.Telugu translation awaiting review by Dr. Haritha Chiramana.
ప్రజలు ఎందుకు నమ్ముతారుWhy people believe it
ప్రోస్టేట్ సమస్యలను తరచుగా వృద్ధాప్యంలో భాగంగా భావిస్తారు, అందుకే నలభైలు, యాభైలలో ఉన్న మగవారు ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి అసలు ఆలోచించకపోవచ్చు.
Prostate problems are often thought of as part of growing old, so men in their 40s and 50s may not think about prostate cancer at all.
ఆధారాలు ఏం చెబుతున్నాయిWhat the evidence shows
యాభై ఏళ్ల లోపు ప్రోస్టేట్ క్యాన్సర్ అరుదు, చాలామందికి అరవైలలో లేదా తర్వాత బయటపడుతుంది. కానీ చిన్న వయసు మగవారికి కూడా వస్తుంది, ముఖ్యంగా బలమైన కుటుంబ చరిత్ర గానీ, బీఆర్సీఏ2 వంటి వంశపారంపర్య జన్యు మార్పు గానీ ఉన్నవారికి. చిన్న వయసు మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్లు కొన్నిసార్లు ఎక్కువ వేగంగా పెరుగుతాయి.
Prostate cancer is uncommon before 50, and most men are diagnosed in their 60s or later. But it does occur in younger men, especially those with a strong family history or an inherited gene change such as BRCA2. Prostate cancers in younger men can sometimes be more aggressive.
మీరు ఏం చేయవచ్చుWhat you can do
దాదాపు యాభై ఏళ్ల నుంచి, కుటుంబ చరిత్ర ఉంటే నలభై ఐదు నుంచి, ప్రోస్టేట్ క్యాన్సర్ పరీక్ష మీకు సరైనదా అని డాక్టర్తో మాట్లాడండి.
From about age 50, or 45 if you have a family history, talk to your doctor about whether prostate cancer testing is right for you.