పిల్లలు, యువతలో ఎముక నొప్పి: ఎప్పుడు ఎక్స్-రే చేయించాలి?
Bone pain in children and teenagers: when to get an X-ray
ముద్రణ ప్రతి · Print PDFవాట్సాప్లో పంపండి · Shareమరింత సమాచారం · Read more →
ఈ లక్షణాలు ఉంటే వైద్యులను కలిసి ఎక్స్-రే చేయించండి
See a doctor and get an X-ray if there is
కొన్ని వారాలుగా తగ్గని ఎముక లేదా కీలు నొప్పి
Bone or joint pain that has not settled for several weeks
రాత్రి నిద్రలో నుంచి లేపే నొప్పి, లేదా విశ్రాంతి తీసుకున్నా తగ్గని నొప్పి
Pain that wakes the child at night, or does not settle with rest
నొప్పి ఉన్న చోట గట్టి వాపు, లేదా కాలు ఈడ్చుకుంటూ కుంటుతూ నడవడం
A firm swelling at the painful spot, or limping
మోకాలు లేదా భుజం చుట్టూ నొప్పి — ఆటల్లో దెబ్బ తగిలిందని అనుకుంటున్నా సరే
Pain around the knee or shoulder, even if it is blamed on a knock during play
చిన్న దెబ్బకే ఎముక విరగడం
A bone that breaks after a minor knock
నడుము నొప్పితో పాటు కాళ్లలో బలం తగ్గడం, లేదా మూత్రం, మలం అదుపు తప్పడం — వెంటనే ఆసుపత్రికి రండి
Back pain with weak legs, or loss of control of urine or stool: come to hospital at once
ఈ పొరపాట్లు చేయకండి
Please avoid these mistakes
రాత్రి నిద్ర లేపే లేదా వారాల తరబడి ఉండే నొప్పిని “ఎదుగుదల నొప్పులు” అని వదిలేయకండి.
Do not dismiss pain that wakes the child at night or lasts for weeks as “growing pains”.
మొదటి ఎక్స్-రే బాగానే ఉన్నా నొప్పి కొనసాగితే, ఎం.ఆర్.ఐ. స్కాన్ అవసరం కావచ్చు.
If the first X-ray looks normal but the pain continues, an MRI scan may be needed.
ఎముక వాపును చీము పట్టడం లేదా క్షయ అని ముక్క పరీక్ష లేకుండా నిర్ణయించకండి; క్షయ మందులను ఊరికే మొదలుపెట్టకండి.
Do not decide that a bone swelling is infection or TB without a tissue test, and do not start TB medicines without proof.
స్కాన్లు, ముక్క పరీక్ష చేయకముందే ఎముకను గీకి శుభ్రం చేసే శస్త్రచికిత్స చేయించకండి.
Do not have the bone scraped out in an operation before scans and a biopsy are done.
తర్వాత ఏం జరుగుతుంది?
What happens next?
మొదట ఎముక మొత్తానికి ఎక్స్-రే; తర్వాత ఎం.ఆర్.ఐ.; ఊపిరితిత్తులకు సీటీ స్కాన్.
First an X-ray of the whole bone, then an MRI, and a CT scan of the lungs.
ముక్క పరీక్షను శస్త్రచికిత్స చేసే ఆసుపత్రిలోనే, లేదా వారితో కలిసి ప్లాన్ చేసి చేయాలి.
The biopsy should be done at the hospital that will operate, or planned together with it.
ఎముక క్యాన్సర్లకు శస్త్రచికిత్సకు ముందు, తర్వాత క్యాన్సర్ మందుల చికిత్స ఇస్తారు; చాలామందిలో కాలు లేదా చేయి తీయకుండా కాపాడవచ్చు.
Cancer medicines are given before and after the operation for bone cancers; in most patients the limb can be saved.
మందులు మొదలుపెట్టే ముందు, అబ్బాయిలకు వీర్యం భద్రపరచడం, అమ్మాయిలకు అండాశయ రక్షణ గురించి వైద్యులతో మాట్లాడండి.
Before the medicines start, talk to the doctors about storing sperm for boys and protecting the ovaries for girls.
గుర్తుంచుకోండి
Remember
పిల్లల్లో ఎముక క్యాన్సర్ అరుదు; కానీ తొందరగా గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది.
Bone cancer is rare in children, but treatment is easier when it is found early.
ఆటల్లో దెబ్బ ఎముక క్యాన్సర్కు కారణం కాదు; దెబ్బ వల్ల అప్పటికే ఉన్న గడ్డ బయటపడుతుంది.
A knock during play does not cause bone cancer; it may only draw attention to a tumour that was already there.
ముక్క పరీక్ష వల్ల క్యాన్సర్ వ్యాపించదు.
A biopsy does not spread cancer.
చికిత్స తర్వాత చాలామంది పిల్లలు నడుస్తారు, పరుగెత్తుతారు, ఆడుకుంటారు.
After treatment, many children walk, run and play.
సారాంశం: కొన్ని వారాలుగా తగ్గని, రాత్రి నిద్ర లేపే ఎముక నొప్పి, వాపు లేదా కుంటడం ఉంటే ఎక్స్-రే చేయించండి. “ఎదుగుదల నొప్పులు” అని వదిలేయకండి. ముక్క పరీక్ష చేయకుండా క్షయ మందులు మొదలుపెట్టకండి, ఎముకను గీయించకండి.
In short: Bone pain that lasts for weeks or wakes the child at night, with a swelling or limp, needs an X-ray. Do not dismiss it as growing pains. Do not start TB medicines or have the bone scraped before a biopsy.