C.R. Reddy Cancer Center · Leela Mahal Road, Nellore
Dr. Haritha ChiramanaMD, DMSenior medical oncologist & hemato-oncologistNellore Patient guides Book a Consultation
🔬

మలంలో దాగిన రక్త పరీక్ష, పేగు లోపల కెమెరా పరీక్ష: పేగు క్యాన్సర్‌ను ముందే పట్టుకునే పరీక్షలు

Stool test (FIT) and colonoscopy: tests that catch bowel cancer early

ముద్రణ ప్రతి · Print PDFమరింత సమాచారం · Read more →

మలంలో దాగిన రక్త పరీక్ష అంటే ఏమిటి?

What is the FIT stool test?

మలంలో కంటికి కనిపించని రక్తాన్ని కనుక్కునే సులభమైన పరీక్ష.

A simple test for blood in the stool that the eye cannot see.

ఇంట్లోనే చిన్న సీసాలో ఒక్క నమూనా తీసుకోవచ్చు; ఆహార నియమాలు అక్కర్లేదు.

One sample taken at home in a small tube; no diet changes needed.

నలభై ఐదు, యాభై ఏళ్లు దాటినవారికి ఏడాదికి లేదా రెండేళ్లకు ఒకసారి ఉపయోగపడుతుంది.

Useful every 1–2 years from age 45–50.

నమూనాను ఇరవై నాలుగు గంటల్లోపు పరీక్షా కేంద్రానికి ఇవ్వండి; ఎండకు, వేడికి దూరంగా ఉంచండి.

Return the sample within 24 hours; keep it away from sun and heat.

రక్తం ఉన్నట్టు తేలితే తప్పకుండా పేగు లోపల కెమెరా పరీక్ష చేయించుకోవాలి — మల పరీక్షను మళ్లీ చేయించడం సరికాదు.

If positive, you must have a colonoscopy — repeating the stool test is not enough.

పేగు లోపల కెమెరా పరీక్ష (కొలనోస్కోపీ) ఎలా చేస్తారు?

What happens at colonoscopy?

ముందు రోజు తేలికపాటి ఆహారం తిని, వైద్యులు ఇచ్చిన ద్రావణం తాగి పేగు శుభ్రం చేసుకోవాలి.

The day before: light food, and drink the prescribed solution to clean the bowel.

మత్తు మందు ఇచ్చి, సన్నని కెమెరా గొట్టంతో పెద్దపేగు మొత్తం చూస్తారు; సాధారణంగా ఇరవై నుంచి నలభై నిమిషాలు పడుతుంది.

With sedation, a thin camera tube examines the whole large bowel; it takes 20–40 minutes.

పేగులో చిన్న కండలు కనిపిస్తే అప్పుడే తీసివేస్తారు; శరీరంపై కోత ఉండదు.

Polyps are removed at the same time; there is no cut on the body.

అదే రోజు ఇంటికి వెళ్లవచ్చు. తీవ్రమైన కడుపు నొప్పి, ఎక్కువ రక్తం లేదా జ్వరం వస్తే వెంటనే ఆసుపత్రికి రండి.

You go home the same day. Come back at once for severe pain, heavy bleeding or fever.

ఈ పరీక్ష ఎవరికి అవసరం?

Who needs colonoscopy?

మల పరీక్షలో రక్తం ఉన్నట్టు తేలినవారు

Anyone with a positive stool test

మలంలో రక్తం, మల అలవాటు మారడం, లేదా రక్తం తక్కువ ఉన్నవారు

Anyone with blood in the stool, a change in bowel habit, or anaemia

ఇంట్లో ఎవరికైనా పేగు క్యాన్సర్ ఉన్నవారు — నలభై ఏళ్ల నుంచి

People with bowel cancer in a close relative — from age 40

గతంలో పేగులో కండలు లేదా పేగు క్యాన్సర్‌కు వైద్యం తీసుకున్నవారు — వైద్యులు చెప్పిన సమయానికి

People treated for polyps or bowel cancer — at the interval your doctor sets

సారాంశం: మలంలో దాగిన రక్త పరీక్ష ఇంట్లోనే చేసుకోగలిగే సులభమైన పరీక్ష. రక్తం ఉన్నట్టు తేలితే పేగు లోపల కెమెరా పరీక్ష తప్పనిసరి; అది క్యాన్సర్‌గా మారకముందే కండలను తీసేయగలదు.

In short: FIT is a simple home stool test for hidden blood, useful every 1–2 years from 45–50. A positive FIT needs a colonoscopy, which can also remove polyps before they become cancer. Close relatives of patients start colonoscopy at 40.