పేగు క్యాన్సర్: ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
Bowel cancer: warning signs not to ignore
ముద్రణ ప్రతి · Print PDFవాట్సాప్లో పంపండి · Shareమరింత సమాచారం · Read more →
ఈ లక్షణాలు మూడు వారాలకు మించి ఉంటే వైద్యులను కలవండి
See a doctor if any of these lasts more than 3 weeks
మలంలో రక్తం, లేదా మలద్వారం నుంచి రక్తం పడడం
Blood in the stool or bleeding from the back passage
మల విసర్జన అలవాటు మారడం: విరేచనాలు, మలబద్ధకం, లేదా రెండూ మారి మారి రావడం
A change in bowel habit: loose stools, constipation, or both in turn
మల విసర్జన తర్వాత కూడా పూర్తిగా అవలేదనిపించడం
Feeling the bowel has not emptied after passing stool
నల్లని మలం
Black stools
కడుపు నొప్పి లేదా ఉబ్బరం తగ్గకపోవడం
Abdominal pain or bloating that does not settle
కారణం లేకుండా బరువు తగ్గడం, నీరసం, రక్తం తక్కువ కావడం
Unexplained weight loss, tiredness or anaemia
కడుపులో గడ్డ
A lump in the abdomen
ఈ పొరపాట్లు చేయకండి
Common mistakes
రక్తం పడిన ప్రతిసారీ అది మొలలు కాదు. మొలలు, క్యాన్సర్ రెండూ ఒకేసారి ఉండవచ్చు.
Bleeding is not always piles. Piles and cancer can occur together.
రక్తం తక్కువైతే రక్తం పెంచే మాత్రలు మాత్రమే సరిపోవు; రక్తం ఎక్కడ పోతుందో కనుక్కోవాలి.
Iron tablets alone are not enough for anaemia; find where blood is being lost.
ముప్పై, నలభై ఏళ్ల వయసులో కూడా పేగు క్యాన్సర్ రావచ్చు.
Bowel cancer can occur in your 30s and 40s too.
కడుపులో గడ్డకు ముక్క పరీక్ష లేకుండా క్షయ మందులు మొదలుపెట్టకూడదు.
Do not start TB medicines for an abdominal lump without a biopsy.
ఎవరికి ఎక్కువ ప్రమాదం?
Who is at higher risk?
తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లల్లో ఎవరికైనా పేగు క్యాన్సర్ ఉంటే — నలభై ఏళ్ల నుంచి పేగు లోపల కెమెరా పరీక్ష
A parent, brother, sister or child with bowel cancer — colonoscopy from age 40
గతంలో పేగులో చిన్న కండలు లేదా క్యాన్సర్ ఉన్నవారు
People who had bowel polyps or bowel cancer before
చాలా ఏళ్లుగా పేగు పుండ్ల (వాపు) వ్యాధి ఉన్నవారు
People with long-standing inflammatory bowel disease (ulcerative colitis, Crohn’s)
అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, పొగ, మద్యం, ఉప్పుతో నిల్వ చేసిన మాంసం ఎక్కువగా తినడం
Excess weight, inactivity, smoking, alcohol and a lot of processed meat
సారాంశం: మలంలో రక్తం, మల అలవాటు మారడం, రక్తం తక్కువ కావడం, బరువు తగ్గడం లేదా కడుపులో గడ్డ మూడు వారాలకు మించి ఉంటే — ఏ వయసులోనైనా — వైద్యులను కలవండి. రక్తం పడితే అది ఎప్పుడూ మొలలు కాదు.
In short: Blood in the stool, a change in bowel habit, unexplained anaemia, weight loss or a lump in the abdomen lasting more than 3 weeks needs a doctor’s check, at any age. Bleeding is not always piles. Early diagnosis gives the best chance of cure.