C.R. Reddy Cancer Center · Leela Mahal Road, Nellore
Dr. Haritha ChiramanaMD, DMSenior medical oncologist & hemato-oncologistNellore Patient guides Book a Consultation
🦷

తల, మెడ కిరణ చికిత్స సమయంలో: నోరు, పళ్లు, ఆహారం, మింగడం

During head and neck radiotherapy: mouth, teeth, food and swallowing

ముద్రణ ప్రతి · Print PDFమరింత సమాచారం · Read more →

కిరణ చికిత్సకు ముందు

Before radiotherapy

దంత వైద్యులను కలవండి; పాడైన పళ్లను కిరణ చికిత్సకు ముందే తీయించుకోండి.

See the dentist; have damaged teeth removed before radiotherapy.

పొగాకు, వక్క, మద్యం పూర్తిగా మానేయండి — చికిత్స బాగా పనిచేస్తుంది.

Stop tobacco, areca nut and alcohol completely — treatment works better.

మింగే వ్యాయామాలు, దవడ వ్యాయామాలు నేర్చుకుని ఇప్పటినుంచే మొదలుపెట్టండి.

Learn swallowing and jaw exercises and start them now.

ప్రతి వారం బరువు చూసుకోండి.

Check your weight every week.

చికిత్స జరిగే వారాల్లో

During treatment

రోజుకు ఐదారు సార్లు ఉప్పు, వంట సోడా కలిపిన గోరువెచ్చని నీటితో పుక్కిలించండి.

Rinse 5–6 times a day with warm water mixed with salt and baking soda.

మెత్తటి కుంచెతో, ఫ్లోరైడ్ ఉన్న పళ్ల పొడి లేదా ముద్దతో మెల్లగా పళ్లు తోముకోండి.

Brush gently with a soft brush and fluoride toothpaste.

మెత్తటి, తడిగా ఉండే ఆహారం తినండి: జావ, ఇడ్లీ, పెరుగన్నం, పప్పు. కారం, మసాలా, పుల్లటివి, బాగా వేడివి వద్దు.

Eat soft, moist food: porridge, idli, curd rice, dal. Avoid chilli, spices, sour and very hot food.

తరచూ కొద్దికొద్దిగా నీళ్లు తాగండి; నోరు పొడిబారకుండా చూసుకోండి.

Sip water often; keep the mouth moist.

నొప్పి ఉంటే చెప్పండి — నొప్పి మందులు ఇస్తాం. చికిత్స మధ్యలో ఆపకండి; ఒక్క రోజు మానినా ఫలితం తగ్గుతుంది.

Tell us about pain — we will give painkillers. Do not stop treatment in between; even one missed day lowers the benefit.

బరువు తగ్గుతుంటే లేదా మింగలేకపోతే వెంటనే చెప్పండి; అవసరమైతే ముక్కు ద్వారా గొట్టంతో ఆహారం ఇస్తాం.

If you are losing weight or cannot swallow, tell us at once; food through a tube in the nose may be needed.

వెంటనే రండి, లేదా 108 కు ఫోన్ చేయండి

Come at once, or call 108, if

జ్వరం — ముఖ్యంగా క్యాన్సర్ మందుల చికిత్స కూడా తీసుకుంటుంటే

Fever — especially if you are also having chemotherapy

నీళ్లు కూడా మింగలేకపోవడం, మూత్రం తగ్గడం

You cannot swallow even water, or you pass little urine

నోటి నుంచి లేదా గొంతు నుంచి రక్తం

Bleeding from the mouth or throat

ఊపిరి ఆడకపోవడం, గొంతులో గురక శబ్దం

Breathlessness or noisy breathing

చికిత్స తర్వాత — జీవితాంతం

After treatment — for life

రోజూ ఫ్లోరైడ్ వాడండి; ఆరు నెలలకు ఒకసారి దంత వైద్యులను కలవండి.

Use fluoride every day; see the dentist every 6 months.

కిరణ చికిత్స జరిగిన దవడలో పళ్లు తీయించాలంటే ముందుగా మీ క్యాన్సర్ వైద్యులకు చెప్పండి — ఎముక దెబ్బతినవచ్చు.

Before any tooth is removed from the treated jaw, tell your cancer doctor first — the bone can be damaged.

దవడ, మింగే వ్యాయామాలు కొనసాగించండి.

Keep up the jaw and swallowing exercises.

ఆరు నుంచి పన్నెండు నెలలకు ఒకసారి థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకోండి.

Have a thyroid blood test every 6 to 12 months.

పొగాకు, వక్క, మద్యం మళ్లీ ముట్టకండి.

Never go back to tobacco, areca nut or alcohol.

1నోరు వీలైనంత వెడల్పుగాతెరిచి కొన్ని క్షణాలు ఉంచండిOpen wide as is comfortable;hold for a few seconds2దవడను మెల్లగా ఒక పక్కనుంచి మరో పక్కకు కదపండిMove the jaw slowlyfrom side to side3గొంతు కండరాలన్నీ బిగించిగట్టిగా మింగండిHard swallow: squeeze thethroat muscles and swallow4నాలుకను అంగిలికి గట్టిగానొక్కి కొన్ని క్షణాలు ఉంచండిPress the tongue hard againstthe roof; hold a few seconds

సారాంశం: కిరణ చికిత్సకు ముందే పళ్ల సమస్యలు సరిచేయించుకోండి. చికిత్స సమయంలో ఉప్పు-సోడా నీటితో పుక్కిలించండి, మెత్తటి ఆహారం తినండి, బరువు చూసుకోండి, చికిత్స మధ్యలో ఆపకండి. చికిత్స తర్వాత జీవితాంతం ఫ్లోరైడ్ వాడండి; పళ్లు తీయించే ముందు మీ క్యాన్సర్ వైద్యులకు చెప్పండి.

In short: Get dental problems fixed before radiotherapy. During treatment, rinse with salt-and-soda water, eat soft food, watch your weight and do not stop treatment in between. Afterwards, use fluoride for life and tell your cancer doctor before any tooth is removed.