C.R. Reddy Cancer Center · Leela Mahal Road, Nellore
Dr. Haritha ChiramanaMD, DMSenior medical oncologist & hemato-oncologistNellore Patient guides Book a Consultation
💊

ఇంట్లో జాగ్రత్తలు: మూర్ఛ మందులు, మెదడు వాపు తగ్గించే మాత్రలు

At home: seizure medicines and steroid (dexamethasone) tablets

ముద్రణ ప్రతి · Print PDFమరింత సమాచారం · Read more →

మూర్ఛ మందులు

Seizure medicines

వైద్యులు చెప్పిన సమయానికి రోజూ వేసుకోండి; మూర్ఛలు ఆగిపోయాయని మీరే మానేయకండి.

Take them every day on time; do not stop them yourself because the fits have stopped.

మూర్ఛ వచ్చిన తర్వాత వైద్యులు అనుమతి ఇచ్చే వరకు బండి నడపకండి, ఈతకు లేదా ఎత్తైన చోట్లకు వెళ్లకండి.

After a seizure, do not drive, swim or climb heights until your doctor allows.

ఇతర మందులు, ముఖ్యంగా కొత్త మాత్రలు మొదలుపెట్టే ముందు మీ వైద్యులకు చెప్పండి.

Tell your doctor before starting any other medicine, especially new tablets.

చిరాకు, దిగులు అనిపిస్తే చెప్పండి — మందు మార్చవచ్చు.

Tell us if you feel irritable or low — the medicine can be changed.

మూర్ఛ వస్తే ఏం చేయాలి?

If a seizure happens

కంగారు పడకండి; మనిషిని పక్కకు తిప్పి పడుకోబెట్టండి, తల కింద మెత్తటిది పెట్టండి.

Stay calm; turn the person on their side and put something soft under the head.

నోట్లో ఏమీ పెట్టకండి; చేతులు, కాళ్లు గట్టిగా పట్టుకోకండి; తాళాలు చేతిలో పెట్టకండి.

Put nothing in the mouth; do not hold the limbs down; do not put keys in the hand.

ఎంతసేపు ఉందో చూడండి. ఐదు నిమిషాలకు మించితే, లేదా ఒకదాని తర్వాత మరొకటి వస్తే 108 కు ఫోన్ చేయండి; వైద్యులు ఇచ్చిన అత్యవసర మందు వాడండి.

Time it. If it lasts over 5 minutes or fits come one after another, call 108 and use the emergency medicine you were given.

మెదడు వాపు తగ్గించే మాత్రలు (డెక్సామెథాసోన్)

Steroid tablets (dexamethasone)

ఇవి మెదడు వాపును తగ్గిస్తాయి; గడ్డకు వైద్యం కాదు. వైద్యులు చెప్పినట్టే మోతాదు తగ్గించాలి — ఒక్కసారిగా ఆపకండి.

They reduce brain swelling; they do not treat the tumour. Reduce the dose only as advised — never stop suddenly.

ఉదయం భోజనంతో వేసుకోండి; సాయంత్రం వేస్తే నిద్ర పట్టదు.

Take them in the morning with food; evening doses spoil sleep.

రక్తంలో చక్కెర పెరగవచ్చు — చక్కెర పరీక్ష చేయించుకోండి. ఎక్కువ దాహం, తరచూ మూత్రం వస్తే చెప్పండి.

Blood sugar may rise — get it checked. Tell us about great thirst or frequent urination.

కాళ్ల బలహీనత, జ్వరం, దగ్గు, నోట్లో తెల్ల మచ్చలు, కాలు వాపు లేదా ఆయాసం వస్తే వెంటనే సంప్రదించండి.

Contact us at once for leg weakness, fever, cough, white patches in the mouth, a swollen leg or breathlessness.

సారాంశం: మూర్ఛ మందులను రోజూ వేసుకోండి, మీరే మానేయకండి; అనుమతి లేకుండా బండి నడపకండి. మూర్ఛ వస్తే పక్కకు తిప్పండి, నోట్లో ఏమీ పెట్టకండి; ఐదు నిమిషాలు దాటితే 108 కు ఫోన్ చేయండి. వాపు తగ్గించే మాత్రలను ఉదయం భోజనంతో వేసుకోండి, ఒక్కసారిగా ఆపకండి.

In short: Take seizure medicines every day and do not stop them yourself; do not drive until your doctor allows. During a seizure, turn the person on their side, put nothing in the mouth and call 108 if it lasts over 5 minutes. Dexamethasone reduces brain swelling; take it in the morning with food, check sugar, and never stop it suddenly.