C.R. Reddy Cancer Center · Leela Mahal Road, Nellore
Dr. Haritha ChiramanaMD, DMSenior medical oncologist & hemato-oncologistNellore Patient guides Book a Consultation
🔬

దగ్గు తగ్గడం లేదా? క్షయనా, క్యాన్సరా — పరీక్షతోనే తెలుస్తుంది

TB or lung cancer? Only tests can tell

ముద్రణ ప్రతి · Print PDFమరింత సమాచారం · Read more →

ఎందుకు జాగ్రత్త?

Why be careful?

క్షయ, ఊపిరితిత్తుల క్యాన్సర్ — రెండింటిలోనూ దగ్గు, బరువు తగ్గడం, కఫంలో రక్తం వంటి ఒకే రకం లక్షణాలు ఉంటాయి.

TB and lung cancer cause the same symptoms: cough, weight loss and blood in the sputum.

ఎక్స్-రే చూసి మాత్రమే క్షయ మందులు మొదలుపెట్టకూడదు.

TB medicines should not be started on an X-ray alone.

క్షయ మందులు మొదలుపెట్టే ముందు యంత్రంతో చేసే కఫ పరీక్ష తప్పకుండా చేయించుకోండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇది ఉచితం.

Before TB treatment, have a molecular sputum test (CBNAAT/TrueNat). It is free in government hospitals.

ఈ సందర్భాల్లో క్యాన్సర్ కోసం కూడా పరీక్షించాలి

When to test for cancer too

కఫ పరీక్షలో క్షయ నిర్ధారణ కాకపోతే

If the sputum test does not confirm TB

క్షయ మందులు వాడినా సుమారు నాలుగు వారాల్లో మెరుగు లేకపోతే

If there is no improvement after about 4 weeks of TB medicines

నలభై ఏళ్లు దాటి, పొగ తాగే అలవాటు లేదా వంట పొగ ఉంటే

If you are over 40 and smoke or were exposed to cooking smoke

ఎక్స్-రేలో గడ్డ కనిపిస్తే

If the X-ray shows a mass

ఛాతీలో నీరు మళ్లీ మళ్లీ చేరితే

If fluid keeps collecting around the lung

గతంలో క్షయ తగ్గినవారికి మళ్లీ లక్షణాలు వస్తే

If symptoms return after earlier TB was cured

ఏ పరీక్షలు?

Which tests?

సీటీ స్కాన్; తర్వాత గొంతు ద్వారా కెమెరా గొట్టంతో ఊపిరితిత్తుల పరీక్ష లేదా ముక్క పరీక్ష.

A CT scan, then bronchoscopy (a camera tube through the throat) or a biopsy.

ఒకే నమూనాలో క్షయ, క్యాన్సర్ రెండింటినీ పరీక్షించవచ్చు.

One sample can be tested for both TB and cancer.

క్షయ, క్యాన్సర్ రెండూ ఒకేసారి ఉండవచ్చు. పరీక్ష లేకుండా నెలల తరబడి మందులు వాడితే క్యాన్సర్ ఆలస్యంగా బయటపడుతుంది.

TB and cancer can occur together. Months of medicines without tests can delay a cancer diagnosis.

సారాంశం: క్షయ, క్యాన్సర్ ఒకేలా కనిపిస్తాయి. మందులు మొదలుపెట్టే ముందు కఫ పరీక్ష చేయించుకోండి; నాలుగు వారాల్లో మెరుగు లేకపోతే క్యాన్సర్ కోసం కూడా పరీక్షించుకోండి.

In short: TB and lung cancer look alike. Get a sputum test before starting TB medicines, and get tested for cancer too if there is no improvement in about 4 weeks.