Home / Myth Busters / Lung cancer
Every patient with lung cancer must have chemotherapy?
ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న ప్రతి రోగికీ కీమోథెరపీ తప్పదా?
Treatment depends on the type, stage and gene changes of the cancer, and on the person's fitness. Some people are treated with surgery, SBRT, targeted tablets or immunotherapy without conventional chemotherapy.
చికిత్స క్యాన్సర్ రకం, దశ, జన్యు మార్పులు, ఆ వ్యక్తి ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. కొందరికి సాంప్రదాయ కీమోథెరపీ లేకుండానే ఆపరేషన్, ఎస్బీఆర్టీ, టార్గెటెడ్ మాత్రలు లేదా ఇమ్యునోథెరపీతో చికిత్స చేస్తారు.
తెలుగు అనువాదం డాక్టర్ హరిత సమీక్షలో ఉంది.Telugu translation awaiting review by Dr. Haritha Chiramana.
ప్రజలు ఎందుకు నమ్ముతారుWhy people believe it
క్యాన్సర్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది కీమోథెరపీ. దాని దుష్ప్రభావాల భయంతో కొందరు అసలు చికిత్సకే వెళ్లరు.
Chemotherapy is the treatment most people associate with cancer, and fear of its side effects keeps some people from seeking treatment at all.
ఆధారాలు ఏం చెబుతున్నాయిWhat the evidence shows
ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్స ఇప్పుడు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ఉంటుంది. తొలిదశ క్యాన్సర్లకు ఆపరేషన్ లేదా ఎస్బీఆర్టీ ఒక్కటే సరిపోవచ్చు. ఈజీఎఫ్ఆర్ లేదా ఏఎల్కే వంటి జన్యు మార్పులు ఉన్న క్యాన్సర్లకు తరచుగా మొదట ఇంట్లో వేసుకునే టార్గెటెడ్ మాత్రలు ఇస్తారు. కొన్ని క్యాన్సర్లకు ఇమ్యునోథెరపీ ఒక్కటే గానీ, కీమోథెరపీతో కలిపి గానీ ఇస్తారు. చాలామందికి కీమోథెరపీ ఇప్పటికీ ముఖ్యమైన చికిత్స, ఇప్పుడు దుష్ప్రభావాలు ఒకప్పటి కంటే చాలా బాగా అదుపులో ఉంటాయి.
Lung cancer treatment is now highly personalised. Early cancers may be treated with surgery or SBRT alone. Cancers with gene changes such as EGFR or ALK are often treated first with targeted tablets taken at home. Some cancers are treated with immunotherapy, alone or alongside chemotherapy. Chemotherapy remains an important treatment for many people, and side effects are much better controlled today than in the past.
మీరు ఏం చేయవచ్చుWhat you can do
మీకు ఫలానా చికిత్స ఎందుకు సూచిస్తున్నారో, ఇతర దారులేమిటో డాక్టర్ను అడగండి. కీమోథెరపీ భయంతో చికిత్సకు దూరంగా ఉండకండి.
Ask your doctor why a particular treatment is being recommended for you, and what the alternatives are. Don't avoid treatment because of fears about chemotherapy.