Home / Myth Busters / Lung cancer
Only smokers get lung cancer?
సిగరెట్ తాగేవాళ్లకు మాత్రమే ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా?
Lung cancer also occurs in people who have never smoked. Second-hand smoke, air pollution, cooking smoke, workplace exposures and family history can all play a part.
ఎప్పుడూ పొగ తాగని వాళ్లకు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. పక్కవాళ్ల పొగ, గాలి కాలుష్యం, వంట పొగ, పనిచేసే చోటి దుమ్ము, కుటుంబ చరిత్ర అన్నీ పాత్ర పోషించవచ్చు.
తెలుగు అనువాదం డాక్టర్ హరిత సమీక్షలో ఉంది.Telugu translation awaiting review by Dr. Haritha Chiramana.
ప్రజలు ఎందుకు నమ్ముతారుWhy people believe it
ఊపిరితిత్తుల క్యాన్సర్కు బాగా తెలిసిన కారణం పొగ తాగడం. అందుకే ఎప్పుడూ పొగ తాగని వాళ్లు తమకు రాదనుకుంటారు, పొగ తాగేవాళ్లను భయపెట్టే లక్షణాలను కూడా పట్టించుకోరు.
Smoking is by far the best-known cause of lung cancer, so people who have never smoked often assume they can't get it, and ignore symptoms that would worry a smoker.
ఆధారాలు ఏం చెబుతున్నాయిWhat the evidence shows
సిగరెట్లు, బీడీలు తాగడం వల్లే చాలా ఊపిరితిత్తుల క్యాన్సర్లు వస్తాయి, కానీ అన్నీ కాదు. జబ్బు బయటపడిన వారిలో చాలామంది, ముఖ్యంగా మన దేశంలో స్త్రీలు, ఎప్పుడూ పొగ తాగలేదు. ఇతర కారణాలు: పక్కవాళ్లు తాగే పొగ పీల్చడం, బయటి గాలి కాలుష్యం, కట్టెలు, బొగ్గు, పిడకల పొయ్యి పొగ, రేడాన్ వాయువు, ఆస్బెస్టాస్, సిలికా దుమ్ము వంటి పనిచేసే చోటి ప్రభావాలు. కొందరికి వంశపారంపర్యంగా ఎక్కువ ప్రమాదం ఉంటుంది.
Smoking cigarettes or bidis causes most lung cancers, but not all. A substantial number of people diagnosed, especially women in India, have never smoked. Other causes include breathing other people's smoke, outdoor air pollution, smoke from cooking on wood, coal or dung fires, radon gas, and workplace exposures such as asbestos and silica dust. Some people also inherit a higher risk.
ఊపిరితిత్తుల క్యాన్సర్కు ఇతర కారణాలుOther causes of lung cancer
- ఇంట్లో లేదా పనిచేసే చోట పక్కవాళ్ల పొగ
- చాలా కాలం పాటు కలుషితమైన బయటి గాలి
- కట్టెలు, బొగ్గు, పిడకలు లేదా కిరోసిన్ వంట పొగ, ముఖ్యంగా గాలి ఆడని వంటగదుల్లో
- ఆస్బెస్టాస్, సిలికా, డీజిల్ పొగ వంటి పనిచేసే చోటి దుమ్ము, రసాయనాలు
- దగ్గరి బంధువుకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చి ఉండటం
- Second-hand smoke at home or at work
- Long-term exposure to polluted outdoor air
- Cooking smoke from wood, coal, dung or kerosene, especially in poorly ventilated kitchens
- Workplace dusts and chemicals, such as asbestos, silica and diesel exhaust
- A close relative who had lung cancer
మీరు ఏం చేయవచ్చుWhat you can do
ఎప్పుడూ పొగ తాగకపోతే ప్రమాదం తగ్గుతుంది, కానీ పూర్తిగా పోదు. తగ్గని దగ్గు లేదా ఛాతీ లక్షణాలు ఉంటే, మీరు పొగ తాగినా తాగకపోయినా పరీక్ష చేయించుకోండి.
Never having smoked lowers your risk, but doesn't remove it. If you have a cough or other chest symptoms that don't settle, get them checked, whether or not you have ever smoked.